తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా ఉన్న బంగారం, వెండి ధరలు...! 6 d ago
మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. గత కొద్ది రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ ఉన్న బంగారం ధరలు 2 రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈనెల 16 వ తేదీ సోమవారం నాడు 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,400 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 77,890 వద్ద స్థిరపడింది. మరోవైపు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి ధర రూ. 1,00,000 గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.